బ్రిటన్ ప్రధాని 'హీరో' సైకిల్ ఎక్కి..

బ్రిటన్ ప్రధాని హీరో సైకిల్ ఎక్కి..

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కొవిడ్ నుంచి కోలుకున్నారు. 56 ఏళ్ల బోరిస్ కరోనాపై పోరులో భాగంగా స్థూలకాయానికి వ్యతిరేకంగా బ్రిటన్ ప్రభుత్వం చేపట్టిన కొత్త జీబీపీ 2 బిలియన్ సైక్లింగ్, వాకింగ్ డ్రైవ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాటింగ్ హామ్ లోని బీస్టన్ వద్ద ఉన్న హెరిటేజ్ సెంటర్ లో సైకిల్ తొక్కారు. హెల్త్, ఫిట్ నెస్ కోసం సైక్లింగ్ చాలా మంచిదని అంటున్నారు. బ్రిటన్ లో కరోనా వైరస్ బారిన పడిన వారిలో ఎక్కువ మంది స్థూలకాయం కారణంగా మరణించారని ఇటీవల నిపుణులు తేల్చారు. దాంతో ఉబకాయాన్ని కట్టడి చేయాలన్న ఉద్దేశంతో బ్రిటన్ ప్రభుత్వం ఆహార పదార్ధాలపై ఉన్న వన్ ప్లస్ వన్ ఆఫర్ ను నిషేధించింది. సైకిల్ తొక్కడం ద్వారా కేలరీలు బర్న్ చేయొచ్చని భావించిన బోరిస్.. దేశంలో వేల కిలోమీటర్ల బైక్ లేన్లను ఆవిష్కరించాలనుకుంటున్నట్లు తెలిపారు. సైక్లింగ్ వల్ల ఫిట్ నెస్ తో పాటు, వాహనాల కాలుష్యం తగ్గి గాలి నాణ్యత పెరుగుతుంది, ట్రాఫిక్ కష్టాలు తీరతాయి అని అంటున్నారు బోరిస్.

Tags

Read MoreRead Less
Next Story