చైనాలో కొత్తగా 127 కరోనా పాజిటివ్ కేసులు

చైనాలో కొత్తగా 127 కరోనా పాజిటివ్ కేసులు

చైనాలో ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు తిరిగి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజగా డిచిన 24 గంటల్లో అక్కడ 127 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మూడు రోజుల నుంచి 120కి పైగా కేసులు నమోదవుతున్నాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ శుక్రవారం తెలియజేసింది. ఇందులో 123 కేసులు దేశానికి చెందినవిగా గుర్తించారు. గడిచిన 24 గంటల్లో ఒక్క జిన్జియాంగ్‌లోనే 112 కేసులు నమోదయ్యాయి. లియోనింగ్ ప్రావిన్స్ 11 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు చైనాలో మొత్తం కేసుల సంఖ్య 84,292కు చేరింది. కరోనా బారి నుంచి కోలుకుని 78,974 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా మహమ్మరి కారణంగా ఇప్పటివరకు 4,634 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags

Read MoreRead Less
Next Story