అంతర్జాతీయం

రెండు విమానాలు ఢీ.. ఏడుగురు మృతి..

రెండు విమానాలు ఢీ.. ఏడుగురు మృతి..
X

అమెరికాలో రెండు విమానాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. సోల్డోట్నా సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం 8:27కి ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఓ విమానంలో పైలట్ ఒక్కరే ఉండగా.. మరో విమానంలో ఆరుగురు ప్రయాణిస్తున్నట్టు భద్రతాధికారులు వెల్లడించారు. ఆరుగురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతిచెందగా.. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించినట్టు అధికారులు పేర్కొన్నారు. మృతిచెందిన వారిలో అలస్కా చట్టసభ సభ్యుడు, రిపబ్లికన్ పార్టీ నేత గ్యారీ నాప్ కూడా ఉన్నారు. ఈ ప్రమాదంపై జాతీయ రవాణా భద్రతా మండలి విచారణ చేపట్టింది.

Next Story

RELATED STORIES