అంతర్జాతీయం

రష్యాలో కరోనా విలయతాండవం

రష్యాలో కరోనా విలయతాండవం
X

రష్యాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకూ వేలల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 5 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒక్కరోజే 95 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు రష్యాలో 8,45,443 మంది కరోనా బారినపడ్డారు. కరోనా బారి నుంచి 6,38,410 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా 14,058 మంది మృతి చెందారు. శనివారం 5,462 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా వీరిలో 1,356 మందికి ఎలాంటి లక్షణాలు లేవని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మాస్కోలో ఒక్కరోజే 690 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Next Story

RELATED STORIES