తాజా వార్తలు

తెలంగాణలో పంజా విసురుతోన్న కరోనా మహమ్మారి

తెలంగాణలో పంజా విసురుతోన్న కరోనా మహమ్మారి
X

తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. గత 24 గంటల్లో మరో 2083 మంది కరోనా భారిన పడ్డారని ప్రభుత్వ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. వీటిలో జీహెచ్ఎంసి పరిధిలో అత్యధికంగా 578 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 64786 కు చేరుకుంది. శుక్రవారం ఒక్కరోజులో 1114 మంది డిశ్చార్జ్ కాగా ఇప్పటివరకు మొత్తం 46502 మంది రికవర్ అయ్యారు. మొత్తం కేసులలో 17 వేల 754 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కాగా శుక్రవారం ఒక్కరోజే 11 మంది కరోనాతో మృతిచెందారు. దేంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 530 కి చేరుకుంది.

Next Story

RELATED STORIES