తాజా వార్తలు

తెలంగాణలో ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన వర్షాలు!

తెలంగాణలో ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన వర్షాలు!
X

తెలంగాణలో ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన వర్షాలు కురుస్తాయని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమి‌ళ‌నాడు ప్రాంతాల్లో 3.1 కిలో‌మీ‌టర్ల నుంచి 5.8 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వ‌రకు ఉప‌రి‌తల ఆవ‌ర్తనం కొన‌సా‌గు‌తుంది. ఈ ప్రభా‌వంతో రాష్ట్రం‌లోని పలు చోట్ల ఆది, సోమ‌వా‌రాల్లో ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురు‌స్తా‌యని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలిపింది. మరో‌వైపు, శుక్ర‌వారం ఉదయం నుంచి శని‌వారం ఉదయం వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షం పడింది. గ్రేటర్‌ హైద‌రా‌బాద్‌ పరి‌ధిలో చాలా ‌చోట్ల శని‌వారం భారీ వర్షం కురి‌సింది.

Next Story

RELATED STORIES