తాజా వార్తలు

హైదరాబాద్ లో భారీ చోరీ

హైదరాబాద్ లో భారీ చోరీ
X

హైదరాబాద్ లో భారీ చోరీ కలకలం రేపింది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సైనిక్ పురిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి నరసింహారెడ్డి ఇంట్లో సుమారు మూడు కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి, నగదు దోచుకెళ్లారు. ఇక తన కుమారుడి వివాహం సందర్బంగా షిరిడి వెళ్లి వచ్చేసరికి ఇల్లంతా గుల్ల చేశారు. ఇంట్లో ఉన్న స్కూటీని కిలోమీటర్ దూరంలో వదిలి పరారయ్యారు. అయితే చోరీ తరువాత పనిమనుషులు ఇంట్లో కనిపించకుండా పోయారు. దీంతో వారిపైనే యజమాని నరసింహారెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Next Story

RELATED STORIES