తాజా వార్తలు

నెగిటివ్ వచ్చినా ట్రీట్ మెంట్ పేరుతో రూ.3లక్షల బిల్లు..

నెగిటివ్ వచ్చినా ట్రీట్ మెంట్ పేరుతో రూ.3లక్షల బిల్లు..
X

వచ్చిన ఒక్క పేషెంట్ నీ వదలకూడదు. నెగిటివ్ వచ్చినా పాజిటివ్ అని చెప్పి ట్రీట్ మెంట్ ఇస్తే బిల్లుతో బాదేయొచ్చు. ప్రవేట్ ఆస్పత్రుల నిర్వాకం ఇలా ఉంది. మనిషి బలహీనతలను ఆసరాగా తీసుకుని కార్పొరేట్ ఆస్పత్రులు ఆటలాడుకుంటున్నాయి. న్యాయవాది అయి ఉండీ ఆయన కూడా మోసపోయారు. హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీకి చెందిన శ్రీధర్ సింగ్ అనే న్యాయవాదికి జూలై 28న జ్వరం, తలనొప్పి వచ్చాయి. దీంతో ఆయన సోమాజిగూడలోని డెక్కన్ ఆస్పత్రికి వెళ్లారు. కరోనా టెస్ట్ చేశారు. రిపోర్ట్ రాకముందే ట్రీట్ మెంట్ మొదలు పెట్టారు.

ఫలితం నెగెటివ్ వచ్చినా ఆ విషయాన్ని న్యాయవాదికి చెప్పకుండా కరోనా చికిత్స చేశారు. విషయం తెలుసుకున్న న్యాయవాది వైద్యులను నిలదీశారు. అయినా పట్టించుకోకపోవడంతో తోటి న్యాయవాదులకు విషయం చెప్పారు. వారు డాక్టర్ల నిర్వాకాన్ని ఎత్తి చూపారు. వ్యాగ్యుద్ధానికి దిగడంతో ఆగస్ట్ 1 అర్ధరాత్రి డిశ్చార్జ్ చేస్తున్నట్లు రూ.3లక్షల బిల్లు చేతిలో పెట్టారు. కట్టిన తరువాతే కదలమన్నారు. బిల్లు చెల్లించి ఇంటికి వచ్చిన న్యాయవాది ఆస్పత్రి నిర్వాకంపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Next Story

RELATED STORIES