రూ.3వేల కోట్లు వెనక్కు ఇవ్వలేమన్న ఎయిర్ లైన్స్

రూ.3వేల కోట్లు వెనక్కు ఇవ్వలేమన్న ఎయిర్ లైన్స్

కరోనా కారణంగా విమానయాన సంస్థలు పీకల్లోతు కష్టాల్లో ఉన్నాయి. విమానాలన్నీ గ్రౌండ్ అయ్యాయి. దీంతో ఆదాయం లేక నిర్వహణ కూడా భారంగా మారింది. అటు ఇప్పటికే రిజర్వ్ చేసుకున్న టికెట్లకు రిఫండ్ చేయాలన్న ఒత్తిడి పెరుగుతోంది. కంపెనీలపై కొందరు కోర్టుల్లో కేసులు కూడా వేశారు. తాము చెల్లించే పరిస్థితిలో లేమని కంపెనీలు చేతులెత్తేశాయి. అయితే 3వేల కోట్ల క్రెడిట్ షెల్స్ ఇచ్చామన్నాయి. భవిష్యత్తులో వారు ప్రయాణించేందుకు అనుగుణంగా వీటిని జారీ చేసినట్టు తెలిపారు. ఇప్పటికే రూ.1500 కోట్లు రిఫండ్ చేశామని.. ఇక తమ వల్ల కాదని కంపెనీలు స్పష్టంచేశాయి. అటు ప్రభుత్వం కూడా ఒత్తిడి తీసుకరావడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపెనీలపై ఒత్తిడి తీసుకరావడం సాద్యం కాదని.. కంపెనీలు కోలుకోవడానికి సమయం ఇవ్వాలని అంటున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story