ఆంధ్రప్రదేశ్

ఉధృతంగా కొనసాగుతున్న అమరావతి ఉద్యమం

ఉధృతంగా కొనసాగుతున్న అమరావతి ఉద్యమం
X

ఏపీలో మూడు రాజధానులు, crda రద్దు బిల్లులకు వ్యతిరేకంగా అమరావతిలో రైతులు ఉధృతంగా

ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. తమకున్న భూమిని రాష్ట్ర భవిషత్ కోసం త్యాగం చేస్తే ప్రభుత్వం తమతో ఆటలాడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ కిరువైపులా రైతులు నిలబడి నిరసన గళం వినిపిస్తున్నారు. ఒకే

రాష్ట్రం.. ఒకే రాజధాని అంటూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు. కరోనాను సైతం లెక్కచేయకుండా రాష్ట్ర ప్రజలకోసం చేస్తున్న ఉద్యమాన్నిప్రభుత్వ పెద్దలు కనీసం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రాజధాని కోసం ఇంకా ఇంకా తమ పోరాటాన్ని ఉదృతం చేస్తామని రైతులు అంటున్నారు.

Next Story

RELATED STORIES