ఫుట్‌బాల్ ప్లేయర్ కొత్త కారు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు

ఫుట్‌బాల్ ప్లేయర్ కొత్త కారు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు

పోర్చుగల్ జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మరియు జువెంటస్ స్టార్ క్రిస్టియానో ​​రొనాల్డో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు బుగట్టి లా వోయిచర్ నోయిర్‌ను కొనుగోలు చేశారు. ఇటాలియన్ దిగ్గజం జువెంటస్ 36 వ సీరీస్ ఎ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకొని విజేతగా నిలిచినందుకుగాను రొనాల్డో, ఈ కారును కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా 10మంది మాత్రమే ఉపయోగించే బుగట్టి లా వోయిచర్ నోయిర్. దీని ఖరీదు సుమారు 8.5 మిలియన్ యూరోలు (రూ. 75 కోట్లు) విలువైనది.

స్టార్ ప్లేయర్ ​​అయిన రొనాల్డో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా లో కొత్త కారుతో తాను దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. 35 ఏళ్ల ఫుట్‌బాల్ క్రీడాకారుడు రోనాల్డో యొక్క గ్యారేజీలో ఉన్న మొత్తం కార్ల విలువ 264 కోట్లు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారు యజమానిగా వార్తల్లో నిలుస్తున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story