అంతర్జాతీయం

ట్రంప్ తో కె ఏ పాల్ యుద్ధం.. 2 వేల రూపాయల పుస్తకం రూ.200కే.

ట్రంప్ తో కె ఏ పాల్ యుద్ధం.. 2 వేల రూపాయల పుస్తకం రూ.200కే.
X

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాజీ సలహాదారుడు డాక్టర్ కె.ఎ.పాల్. 2016లో ట్రంప్ యొక్క ఆధ్యాత్మిక సలహా బోర్డు సభ్యులుగా పాల్ పనిచేశారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సువార్తకుడిగా పాల్ కు పేరుంది. అయితే రానున్న ఎన్నికల్లో ట్రంప్ ని ఓడించడానికి గల 10 కారణాలను వివరిస్తూ'' Save America And The World From Trump'' అనే పుస్తకంలో పొందుపరిచారు. అధ్యక్షుడు ట్రంప్ కు మద్దతు ఇచ్చే వారితో సహా ప్రతి అమెరికన్ ఈ దేశాన్ని కాపాడడానికి మంచి మనసుతో ఈ పుస్తకాన్ని చదవాలని పాల్ పేర్కొన్నారు.

వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్యలో ఎంబిఎస్ కీలక పాత్ర వహించారని మీడియాకు వివరించారు ట్రంప్ సెనెటర్ లిండ్సే గ్రాహం. ఎంబిఎస్ సౌదీ రాజు పదవికి రాజీనామా చేయాలంటూ బహిరంగంగా పిలుపునిచ్చారు. వాస్తవానికి ట్రంప్, అతని అల్లుడు జెరోడ్ కుష్నర్.. సౌదీ యువరాజు ఎంబిఎస్ తో రెండు బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుని చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడ్డారని డాక్టర్ పాల్ ఆరోపించారు. కానీ అమెరికా ప్రజల ముందు ట్రంప్ మంచి వాడిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అని పాల్ ఆరోపిస్తున్నారు. ఈ విషయాలన్నీ కూలంకషంగా ఈ పుస్తకంలో వివరించానని అంటున్నారు.

ఈ పుస్తకం మిగతా వాటికి భిన్నంగా ఉంటుందని చెప్పారు. ఎందుకంటే ఇది అధ్యక్షుడు ట్రంప్ యొక్క ఆధ్యాత్మిక నాయకులందరూ ఆమోదించిన అత్యంత గౌరవనీయమైన సువార్త నాయకుడి నుండి వచ్చింది. జాత్యహంకారాన్ని ఓడించడానికి ట్రంప్‌ను ఓడించండి.. కరోనా మహమ్మారి నుండి అమెరికా ప్రజలను రక్షించండి.. వాతావరణాన్ని కాపాడటానికి.. అమెరికాతో పాటు ప్రపంచాన్ని కాపాడటానికి ట్రంప్‌ను ఓడించండి. ఈ పుస్తకం అమ్మగా వచ్చిన మొత్తం ఆదాయాన్ని సేవ్ అమెరికా స్వచ్ఛంద సంస్థలకు తరలిస్తామని డాక్టర్ పాల్ వివరించారు. డాక్టర్ కె.ఎ. పాల్ రాసిన పుస్తకం కావలసిన వారు అమెజాన్ ద్వారా ఈ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు.

https://www.amazon.com/dp/B08F14CM8G?ref_=pe_3052080_276849420&fbclid=IwAR1vbfMewdrRztCiIT3OUl1yDGBplD5fLqV_rscMJSq8R0abUjTP0hKGAMw

Next Story

RELATED STORIES