అంతర్జాతీయం

కరోనాని తక్కువ అంచనా వేస్తే కచ్చితంగా అటాక్.. : కొవిడ్ బారిన పడ్డ జంట

కరోనాని తక్కువ అంచనా వేస్తే కచ్చితంగా అటాక్.. : కొవిడ్ బారిన పడ్డ జంట
X

మొదట్లో అందరూ కరోనా గురించి మాట్లాడుతుంటే తేలిగ్గా తీసుకుని తక్కువ అంచనా వేశాం.. ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది అని అమెరికాకు చెందిన ఓ జంట వాపోతున్నారు. ఏదైనా తనదాకా వస్తే కానీ తెలియదంటారు. ఇప్పుడు వారి పరిస్థితి అలానే ఉంది. కోవిడ్ బారిన పడి నెల రోజుల తరువాత కోలుకున్నప్పటికీ ఇంకా కరోనా లక్షణాలు వెంటాడుతూనే ఉన్నాయి. దాంతో భయం పట్టుకుంది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎప్పుడు ఊపిరి ఆగిపోతుందో తెలియనట్లుగా ఉందని ఆందోళన చెందుతున్నారు.

అరిజోనాకు చెందిన డెబి, మైఖేల్ పాటర్ సన్ అనే జంట కరోనా మహమ్మారిని తేలిగ్గా తీసుకుని కనీసం ఫేస్ మాస్క్ కూడా లేకుండా రోడ్డుమీదకు వచ్చేవారు. తీరా కరోనా బారిన పడిన తరువాత చేసిన తప్పు తెలుసుకుని చెంపలేసుకుంటున్నారు. నెల రోజుల చికిత్స అనంతరం ఇంటికి వచ్చినా డెబీ ఇప్పటికీ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతోంది. తలనొప్పి, దగ్గు నిత్యం వస్తూనే ఉన్నాయి. చికిత్స సమయంలో పక్క బెడ్ మీద ఉన్న వ్యక్తి కరోనా మరణించిన సంఘటన చూసిన తరువాత డెబీకి భయం పట్టుకుంది.

తాను కూడా కొవిడ్ తో ప్రాణాలు కోల్పోతానేమోనని ఆందోళన చెందుతోంది. ఎవరైనా కరోనాని కేర్ చేయకపోతే కోరి మరణాన్ని తెచ్చుకన్నట్టేనని ఈ జంట చెబుతోంది. తాము చేసిన తప్పు మరెవరూ చేయొద్దు.. ఫేస్ మాస్క్ ధరించడం.. భౌతిక దూరం తప్పక పాటించండి.. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది అని కరోనా నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెబుతున్నారు.

Next Story

RELATED STORIES