కరోనా వచ్చింది.. కిచెన్ ని సరికొత్తగా మార్చేసింది

కరోనా వచ్చింది.. కిచెన్ ని సరికొత్తగా మార్చేసింది

అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యాన్ని అందించే మంచి ఆహారం తీసుకోవాలి. ఇంట్లో ఉన్న అన్ని రూములు ఒక ఎత్తైతే.. వంటగది ఒక్కటే ఒక ఎత్తు. వంటిల్లు ఓ వైద్యశాలతో పాటు.. ఆరోగ్యాన్ని అందించే ఓ సంజీవిని. కరోనా వేళ వంటగదిలో శుభ్రతకు ప్రాధాన్యత పెరిగిపోయింది. ప్రస్తుతం అందరూ వంటగదిలో ఎక్కువ సమయాన్ని గడుపుతుండడంతో కిచెన్ కూల్ గా ఉండాలని భావిస్తున్నారు. కస్టమర్ల అభిరుచి మేరకు ఎయిర్ కండిషనర్ తో కూడిన చిమ్నీని మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఇది వండగదిలోని వేడిని తగ్గిస్తుంది. మసాలా దినుసులు భద్రపరుచుకునేందుకు కూల్ డ్రాయర్స్ కొత్తగా వస్తున్నాయి.

వీటిని మాడ్యులర్ కిచెన్లలో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సింక్ విషయంలో కూడా మరింత జాగ్రత్త వహిస్తున్నారు. సాధారణంగా భారతీయ వంటకాలన్నీ నూనె, మసాలాలతో ఉంటాయి. దాంతో సింక్ వాసనతో పాటు జిడ్డు పట్టేస్తుంది. కొత్తగా వస్తున్న సింక్‌లు లోతుగా ఉంటాయి. వాటికి ఆటో వాటర్ హీటర్స్ ఉంటాయి. దీనివల్ల సింక్ లోని గిన్నెలు స్టీమ్ తో శుభ్రమై తళతళా మెరుస్తాయి.

త్వరగా వంట పూర్తి చేసేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ పరికరాలు వంటగదిలోకి మరిన్ని వచ్చి చేరాయి. కన్వెక్షన్ మైక్రోవేవ్స్ అమ్మకాలు, ఫుడ్ ప్రాసెసర్స్, వాక్యూమ్ క్లీనర్స్, మైక్రోవేవ్స్ వాడకం పెరిగిందంటున్నారు మార్కెట్ నిపుణులు. వాటర్ కెటిల్స్ కు, టీ కెటిల్స్ డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ఎయిర్ ఫ్రైయర్స్, స్లో జ్యూసర్, న్యూట్రీ బ్లెండ్ ల వైపు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. ఎన్ని వారాలైనా కూరగాయలు తాజాగా ఉండేలా ఫ్రిజ్ లలో కూడా అత్యంత ఆధునిక సౌకర్యాలు వచ్చాయి. వేఫల్ మేకర్స్, బ్రెడ్ మేకర్స్, మల్టీపర్పస్ శాండ్ విచ్ మేకర్లు సైతం వచ్చాయి.

Tags

Read MoreRead Less
Next Story