అంతర్జాతీయం

ఇజ్రాయెల్‌లో అదుపులోకి రాని కరోనా.. వెయ్యికి పైగా..

ఇజ్రాయెల్‌లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి, పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీంతో ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్‌లో గత 24 గంటల్లో 1,615 కొత్త కేసులు నమోదయ్యాయి.

దీంతో ఇక్కడ మొత్తం కరోనా భారిన పడిన వారి సంఖ్య 74 వేల 430 కు పెరిగింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, మరణాలు మాత్రం గత 24 గంటల్లో కేవలం 10 మాత్రమే నమోదయ్యాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య ఇప్పుడు 546 గా ఉంది. గత 24 గంటల్లో 1,894 మంది రోగులు కోలుకున్నారు. మరోవైపు దేశంలో పెరుగుతున్న కరోనా కేసులపై చర్చించడానికి నిన్న సాయంత్రం ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కేబినెట్ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Next Story

RELATED STORIES