మరో మూడు రోజుల్లో రానా-మిహిక ఏడడుగులు.. అతిధులు ఎవరంటే..

మరో మూడు రోజుల్లో రానా-మిహిక ఏడడుగులు.. అతిధులు ఎవరంటే..
X

టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా.. ప్రేయసి మిహికా బజాజ్‌తో ఏడడుగులు వేసే ముహూర్తం దగ్గరకు వచ్చేసింది. మరో మూడు రోజుల్లో మిహిక మెడలో మూడు ముళ్లు వేస్తారు. పెళ్లి వేడుకను బ్రహ్మాండగా చేయాలనుకున్నా కరోనా వచ్చి అన్ని వేడుకలను కట్టడి చేసింది. మహా మహుల చేతులకు సైతం తాళం వేసింది. భారీ సంఖ్యలో వివాహ మహోత్సవానికి అతిధులు హాజరవుతున్నారని వినిపిస్తున్న వార్తల నేపథ్యంలో రానా తండ్రి సురేష్ బాబు స్పందించారు.

రోకా ఫంక్షన్ నిర్వహించిన రామానాయుడు స్టూడియోలోనే వెడ్డింగ్ సెరిమనీ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ వేడుకకు 30 మంది మాత్రమే హాజరవుతారని అన్నారు. ఇరు కుటుంబ సభ్యులు మినహా అతిథులు ఎవరూ ఉండరని అన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నందున వేడుకకు పిలిచి ఎవరి ఆరోగ్యాన్నీ రిస్క్ లో పడేయాలనుకోవట్లేదని అన్నారు. ఇండస్ట్రీలో, బయట ఉన్న అత్యంత సన్నిహితులను కూడా ఆహ్వానించట్లేదని అన్నారు. చాలా సింపుల్ గా, అంతే అందగా, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య రానా పెళ్లి జరుగుతుందని సురేష్ బాబు స్పష్టం చేశారు. కరోనా తగ్గుముఖం పట్టాక అందరినీ పిలిచి గ్రాండ్ గా పార్టీ ఇస్తామన్నారు.

Next Story

RELATED STORIES