రాళ్లు కాదు రత్నాలు.. వాటి విలువ కోట్లు..

రాళ్లు కాదు రత్నాలు.. వాటి విలువ కోట్లు..

అదృష్టం అతడి వెంటే ఉంది. అందుకే ఒకసారి కాదు రెండు సార్లు రత్నాలు దొరికాయి. దాంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. టాంజానియాకు చెందిన సనెన్యూ లైజర్ గనులు తవ్వే పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఓ రోజు గనులు తవ్వుతుండగా రెండు పెద్ద రత్నాలు దొరికాయి. తాజాగా మరోసారి రత్నం దొరికింది. మన్యారాలోని టాంజానియా గనుల్లో లభ్యమైన ఈ రత్నం 6.3 కిలోల బరువు తూగింది. దీనివిలువ 4.7 బిలియన్ టాంజానియా షిల్లాంగ్స్ గా ఉంది. ఈ అరుదైన రత్నాలను ప్రభుత్వానికి విక్రయించగా సుమారు 25 కోట్లు వచ్చాయి. దాంతో ఒక్కసారిగా ధనవంతుడైపోయాడు.

అయితే తన జీవితంలో ఊహించనంత డబ్బు అంత పెద్ద మొత్తం వచ్చినా ఎలాంటి ఆర్భాటాలకు పోలేదని లైజర్ వెల్లడించాడు. ఎప్పటిలాగే తనకున్న 2 వేల ఆవులను పెంచుకుంటున్నానని చెప్పాడు. తనకు వచ్చిన ఆ డబ్బుతో పాఠశాలను కట్టిస్తాను అని అంటున్నాడు. కాగా, లైజర్ కు నలుగురు భార్యలు, ముఫ్పైమంది పిల్లలు ఉన్నారు. భూమి మీదే అరుదైనవిగా టాంజానైట్ రత్నాలు గుర్తింపు పొందాయి. ఇవి ఆకుపచ్చ, ఎరుపు, నీలం, పర్పుల్ రంగుల్లో లభ్యమవుతాయి. అయితే రానున్న 20 ఏళ్లలో ఇవి అంతరించిపోతాయని అక్కడి భూగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story