ఆంధ్రప్రదేశ్

జేసీ ప్రభాకర్ రెడ్డికి బెయిల్

జేసీ ప్రభాకర్ రెడ్డికి బెయిల్
X

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి బెయిల్ ముంజూరైంది. వాహనాల రిజిస్ట్రేషన్ అక్రమాల కేసులో గతంలో వీరిద్దరూ అరెస్ట్ అయ్యారు. బీఎస్3 వాహనాలను బీఎస్ 4గా రిజిస్ట్రేషన్ చేసిన కేసులో వీరిద్దరిని పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. తరువాత వారిని అనంతపురానికి తరలించారు. మొత్తం 154 లారీలకు అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని వీరిపై అభియోగాలు ఉన్నాయి. కాగా.. వీరికి మూడు కేసులల్లో అనంతపురం ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం బుధవారం బెయిల్ ముంజూరు చేసింది.

Next Story

RELATED STORIES