అంతర్జాతీయం

గూగుల్, ట్విట్టర్ బాటలో ఫేస్‌బుక్..

గూగుల్, ట్విట్టర్ బాటలో ఫేస్‌బుక్..
X

కరోనా భయంతో సాప్ట్ వేర్ ఉద్యోగులంతా ఇంటి నుంచే పని చేస్తున్నారు. కాస్తైనా తగ్గుముఖం పడితే ఆఫీసులకు వెళ్లొచ్చనుకుంటే కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలోనే గూగుల్, ట్విట్టర్ సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే వచ్చే ఏడాది జూన్ వరకు పని చేయమని భరోసా ఇచ్చింది. ఇప్పుడు ఇదే బాటలో ఫేస్‌బుక్ కూడా పయనిస్తోంది. అంతే కాకుండా వర్క ఫ్రం హోమ్ చేసేవారు వారి ఆఫీస్ అవసరాలకు సంబంధించి వెయ్యి డాలర్లు కూడా ఇస్తామని వెల్లడించింది. దీంతో పాటు నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో ఉద్యోగులను నియమించి పలు చోట్లు ఆఫీసులను నడిపిస్తున్నామని సంస్థ తెలిపింది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అమెరికా, లాటిన్ అమెరికాలోని కార్యాలయాలను ఇప్పట్లో తెరిచే అవకాశం లేదని ఫేస్‌బుక్ వర్గాలు తెలిపాయి.

Next Story

RELATED STORIES