తాజా వార్తలు

కాష్మోరా చిత్ర దర్శకుడు ఎన్‌ బీ చక్రవర్తి కన్నుమూత

కాష్మోరా చిత్ర దర్శకుడు ఎన్‌ బీ చక్రవర్తి కన్నుమూత
X

కాష్మోరా చిత్ర దర్శకుడు ఎన్‌ బీ చక్రవర్తి కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చక్రవర్తి శోభన్ బాబుతో 1984లో 'సంపూర్ణ ప్రేమాయణం', 1985-86లో నందమూరి బాలకృష్ణ నటించిన 'కత్తుల కొండయ్య',

'నిప్పులాంటి మనిషి' చిత్రాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు 1986లో వచ్చిన ‘కాష్మోరా’ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి ప్రజాధారణ పొందింది. కాగా దర్శకుడు ఎన్ బి చక్రవర్తి అనారోగ్యంతో కన్నుమూశారని సూపర్ హిట్ మ్యాగజేన్ అధినేత బిఎ రాజు తెలిపారు.

Next Story

RELATED STORIES