రక్తంలో మార్పుల ఆధారంగా కొవిడ్ తీవ్రత అంచనా..

రక్తంలో మార్పుల ఆధారంగా కొవిడ్ తీవ్రత అంచనా..

అమెరికా శాస్త్రవేత్తలు కొవిడ్ గురించిన ఓ అరుదైన విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. తీవ్రస్థాయిలో వ్యాధి లక్షణాలు ఉండి, వారిని మరణానికి చేరువ చేస్తుందనే విషయం రక్తంలో సూచించే ఐదు ప్రధాన కారణల ద్వారా తెలుస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి ఇవి ఉపకరిస్తాయని వారు తెలిపారు. వైరస్ సోకిన 299 మందిని జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయ ఆసుపత్రి శాస్త్రవేత్తలు పరిశీలించారు. 200 మంది రోగుల్లో ఐఎల్-6, డి-డిమర్, సీఆర్పీ, ఎల్డీహెచ్, ఫెరిటిన్ అనే బయోమార్కర్ల స్థాయి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వీటి స్థాయి పెరిగితే ఇన్ ప్లమేషన్, రక్తస్రావం వంటి రుగ్మతలు తలెత్తుతుంటాయి. లీటరు రక్తంలో ఎల్‌డీహెచ్‌ స్థాయి 1200 యూనిట్లు, డి-డిమర్ స్థాయి.. మిల్లీలీటరుకు మూడు మైక్రోగ్రాముల కన్నా ఎక్కువైతే ప్రమాద ముప్పు పొంచివున్నట్లే అని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇలాంటి వారిని ముందే గుర్తిస్తే చికిత్స ప్రణాళికను ముందే సిద్ధం చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. బాధితుడిని డిశ్చార్జ్ చేయాలా లేదా అనే విషయం కూడా నిర్ధారించుకోవచ్చని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story