అనారోగ్యంతో ఆస్ప్రతిలో చేరిన సంజయ్ దత్

X
TV5 Telugu9 Aug 2020 8:48 AM GMT
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. శ్వాససమస్యతో భాదపడుతున్న ఆయన ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు అని ఏఎన్ఐ ప్రకటించింది. శ్వాస సంబంధమైన ఇబ్బంది తలెత్తడంతో.. ఆయనకు కరోనా పరీక్ష చేశారు. కానీ, నెగెటివ్ అని వచ్చింది. అయినా.. కొన్ని రోజులు వైద్యుల పరిశీలనలో ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. సంజయ్ దత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన ఆరోగ్యం గురించి బయపడాల్సిన పని లేదని వైద్యులు తెలపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని.. అయితే, కరోనా కాదని స్పష్టం చేశారు. దీంతో నాన్ కోవిడ్ వార్డ్ లోనే ఆయనకు చికిత్స అందిస్తున్నారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కాగా.. సంజయ్ దత్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలియగానే.. ఆయన అభిమానులు సంజయ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Next Story