హాస్పటల్‌లో చేరిన నటుడు సంజయ్‌ దత్

హాస్పటల్‌లో చేరిన నటుడు సంజయ్‌ దత్
X

ప్రముఖ సినీనటుడు సంజయ్ దత్ ఆసుపత్రిలో చేరారు. కొద్దిరోజులుగా ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆయనకు వైద్య చికిత్స అవసరం అయింది. దీంతో ఆయన ముంబైలోని లీలావతి హాస్పటల్‌లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఆయనకు చికిత్సకు ముందు కరోనా పరీక్షలు చేశారు. పరీక్షలో నెగటివ్ అని వచ్చింది.

కొన్ని రోజులు వైద్యుల పరిశీలనలో ఉండాలని ఆయన అనుకున్నారు. ప్రస్తుతం సంజయ్ దత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. సంజయ్ కు నాన్ కోవిడ్ వార్డ్‌లోట్రీట్‌మెంట్ చేస్తున్నట్లుగా లీలావతి హాస్పటల్ వైద్య సిబ్బంది ప్రకటించింది.

Tags

Next Story