ఆంధ్రప్రదేశ్

టీటీడీ ఉద్యోగుల్లో 743 మందికి కరోనా పాజిటివ్

టీటీడీ ఉద్యోగుల్లో 743 మందికి కరోనా పాజిటివ్
X

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో ఇప్పటి వరకూ 743 మంది కరోనా భారిన పడ్డారు. ఇటీవల వారందరికీ కోవిడ్ పరీక్షలు చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇందులో 400 మంది కరోనా నుంచి కోలుకొని నగరంలోని పలు కోవిడ్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలావుంటే ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే వున్నాయి. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 వరకు 62,123 మందికి పరీక్షలు నిర్వహించగా, 10,080 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,17,040కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ శనివారం బులెటిన్‌లో పేర్కొంది.

Next Story

RELATED STORIES