బ్రెజిల్ లో కరోనా విస్ఫోటనం.. గత 24 గంటల్లో..

బ్రెజిల్ లో కరోనా విస్ఫోటనం ఆగడంలేదు. గత 24 గంటల్లో బ్రెజిల్ లో కొత్తగా 23,010 కొత్త కేసులు, వైరస్ వల్ల 572 మంది మరణించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. కాగా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి మొత్తం 3,035,422 వైరస్ కేసులు నమోదు చేసింది. దీంతో

COVID-19 అధికారిక మరణాల సంఖ్య 101,049 కు పెరిగిందని మంత్రిత్వ శాఖ గణాంకాలు పేర్కొన్నాయి. కాగా బ్రెజిల్ లో కరోనావైరస్ వ్యాప్తి యునైటెడ్ స్టేట్స్ తరువాత ప్రపంచంలోనే అత్యంత ఘోరంగా ఉంది. ఇక్కడ కేసులు, మరణాల సంఖ్యలో అమెరికా తరువాతి స్థానంలో నిలిచింది.

Tags

Read MoreRead Less
Next Story