ఆంధ్రప్రదేశ్

శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం

శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం
X

పడమటి కనుమల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యామ్‌లు నిండుకుండలుగా మారాయి. దీంతో దిగువకు నీరు వదులుతున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం అంతకంతకూపెరుగుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకూ డ్యామ్ లోకి 2,13,486 క్యూసెక్కుల నీరు వరద నీరు చేరింది..అయితే ఎడమ గట్టు కేంద్రంలో

విద్యుదుత్పత్తి కోసం 40,259 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం శ్రీశైలంలో 855.80 అడుగుల్లో 94.02 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు

పూర్తిస్థాయిలో నిండాలి అంటే ఇంకా 121 టీఎంసీలు అవసరం. ఇంతేమొత్తంలో వరద ప్రవాహం మరో వారం రోజులపాటు కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు నిండుతుంది.

Next Story

RELATED STORIES