కొరియోగ్రాఫర్ వర్సెస్ డెంటిస్ట్ ని పెళ్లాడనున్న చాహల్

ఇప్పటి వరకు సినిమా యాక్టర్స్ ని ఆటగాళ్లు ముఖ్యంగా క్రికెటర్లు పెళ్లి చేసుకున్న జంటల్ని చూశాము. రొటీన్ ని బ్రేక్ చేస్తూ టీమ్ ఇండియా ఆటగాడు చాహల్ వైద్యురాలు, యూట్యూబ్ స్టార్ ధనశ్రీ ని పెళ్లి చేసుకుంటున్నానని ప్రకటించాడు. స్పిన్నర్ గా మైదానంలో ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించే చాహల్ మాదిరిగానే ధనశ్రీ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఆమెకు ఉన్న ఫాలోవర్ల సంఖ్యే అందుకు నిదర్శనం. 2014లో నవీ ముంబయిలోని డీవై పాటిల్ డెంటల్ కాలేజీని నుంచి డిగ్రీ పొందిన ధనశ్రీకి కొరియోగ్రఫీ అంటే మక్కువ ఎక్కువ. ఓ డ్యాన్స్ అకాడమీని కూడా నిర్వహిస్తున్న ధనశ్రీకి సొంత యూట్యూబ్ ఛానెల్ ఉంది. 15 లక్షల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. చాహెల్ ను వివాహం చేసుకుంటున్నానని పెట్టిన పోస్టుకు రెండు లక్షలకు పైగా లైకులు వచ్చాయంటే ఆమె రేంజ్ ఏంటో అర్థమవుతోంది. ఆమె చేసిన 'చో గడాతరా' వీడియోకు 48 మిలియన్ వ్యూస్, 'ఓ సాకీ సాకీ' వీడియోకు 16 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com