నితీష్ ప్రభుత్వం నిద్రపోతుంది: తేజస్వీ యాదవ్

బీహార్‌లోని అధికార పార్టీపై ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఓవైపు కరోనా, మరోపైపు వరదలు అతలాకుతలం చేస్తుంటే.. నితీష్ కుమార్ ప్రభుత్వం నిద్రమత్తులో ఉందని తేజస్వీయాదవ్ విమర్శించారు. ఉపాధిలేక రాష్ట్ర ప్రజలు అల్లాడతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. 75 లక్షల మందిపై వరదల ప్రభావం పడిందని అన్నారు. పలుజిల్లాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నారని తేజస్వీ తెలిపారు.
40లక్షల మంది వలస కార్మికులు కరోనా కారణంగా పొట్ట చేతపట్టుకొని రాష్ట్రాన్ని చేరుకున్నారని.. అయితే, వారికి ఉపాధి లేక ఇంట్లోనే ఆకలితో అలమటిస్తున్నారు. ఈ కరోనా, వరదలకు తోడు రాష్ట్రంలో ఆరోగ్యసేవలు పూర్తిగా కుంటిపడ్డాయని అన్నారు. దాదాపు 7 లక్షల మందికి ఉద్యోగాలు లేవని, వ్యాపారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా.. 15 ఏళ్ల నితీశ్ ప్రభుత్వం మాత్రం నిద్రపోతున్నదని ఆయన ఎద్దేవా చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com