'స్పుత్నిక్ వీ' వ్యాక్సిన్ కోసం లైన్లో ఉన్న 20 దేశాలు..

స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కోసం లైన్లో ఉన్న 20 దేశాలు..

ఏడారిలో నీటి చుక్క కోసం ఎదురు చూసినట్లు ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో ఊరటనిచ్చే అంశం రష్యా వ్యాక్సిన్. ప్రపంచంలోనే తొలి కొవిడ్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ మంగళవారం ప్రకటించారు. ఈ వ్యాక్సిన్ పేరు స్పుత్నిక్ వీ అని దీనిని బుధవారం నుంచి ఫేస్ 3 ట్రయల్స్ కు ఉపయోగిస్తామని తెలిపారు. సెప్టెంబర్ నుంచి వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని అన్నారు. 20 దేశాల నుంచి బిలియన్ డోసులకంటే ఎక్కువగానే ఆర్డర్స వస్తున్నాయని ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేసిన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ అధిపతి కిరిల్ డిమిత్రియేవ్ వెల్లడించారు. కాగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో యూఎస్ఏ, బ్రెజిల్, భారత్ తర్వాత రష్యా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఇక్కడ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,97,599 కాగా మరణాలు 15,131 సంభవించాయి.

Tags

Read MoreRead Less
Next Story