పగలూ రాత్రి పబ్జీ.. ఆరోగ్యం క్షీణించడంతో బాలుడు మృతి

పగలూ రాత్రి పబ్జీ.. ఆరోగ్యం క్షీణించడంతో బాలుడు మృతి

స్మార్ట్ ఫోన్లు వచ్చి మంచి చేస్తున్నాయని సంతోషించాలో లేక పిల్లల ప్రాణాలు హరిస్తున్నాయని బాధపడాలో అర్థం కాని పరిస్థితి. పబ్జి అని ఒక చెత్త గేమ్ వచ్చి పిల్లలను ఆ గేమ్ కి బానిసలను చేస్తుంది. పగలూ రాత్రి అదే పనిగా ఆడుతున్నారు. అమ్మానాన్న మాట అసలు వినట్లేదు. ఆన్ లైన్ చదువులు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇంక 24 గంటలూ ఫోన్ పిల్లల చేతుల్లోనే ఉంటోంది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో పబ్జి, ఫ్రీఫైర్ గేమ్ కి బానిసై అనారోగ్యంతో పవన్ అనే బాలుడు మృతి చెందాడు. ఇంటర్మీడియెట్ చదువుతున్న పవన్ పబ్జీ మోజులో పడి నిద్రాహారాలు మానేసి 24 గంటలూ ఆట మీదే దృష్టి. దాంతో నాలుగు రోజులుగా ఆరోగ్యం క్షీణించడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు.

Tags

Read MoreRead Less
Next Story