దుబాయ్ రాజు కారుపై పక్షి గూడు.. లక్కీ బర్డ్ అంటూ..

దుబాయ్ రాజు కారుపై పక్షి గూడు.. లక్కీ బర్డ్ అంటూ..

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ తన మెర్సిడెస్‌ కారుపై పక్షి గూడు కట్టుకోవడాన్ని గుర్తించారు. ఆ గూడును తొలగించడానికి ఆయనకు మనసొప్పలేదు. కొన్ని రోజుల పాటు కారుని గ్యారేజ్ లోనే ఉంచి పక్షి గుడ్లు పొదిగి పిల్లలు అయి ఎగిరిపోయేంత వరకు కారుని కదిలించలేదు. రాజు మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకృతి ప్రేమికుడు. తన మెర్సిడెస్-ఎఎమ్‌జి జి 63 ఎస్‌యువిని కారుపై పక్షి గూడు కట్టుకుందని, పక్షికి ఇబ్బంది కలగకుండా ఉండటానికి అతను తన సిబ్బందికి ఆ ప్రాంతానికి దూరంగా ఉండమని చెప్పారు.

కొన్ని సార్లు చిన్న చిన్న విషయాలే చాలా ఆనందాన్ని ఇస్తాయని చెబుతూ తన కారుపై పక్షి గూడు కట్టుకుని గుడ్లు పెట్టిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేశారు దుబాయ్ ప్రిన్స్. పక్షి ఆ గుడ్లను పొదిగి పిల్లలను అయిన వీడియోను నెటిజన్స్ తో పంచుకున్నారు. పక్షి లగ్జరీ కారుపై గూడు కట్టుకుని తన పిల్లలను చూసుకుంటోంది అని రాసుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో 24 గంటల్లో 1.5 మిలియన్ల మంది వీక్షకులు చూశారు. ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు బిన్ రషీద్ ను ప్రశంసిస్తున్నారు. మీరు పెట్టిన పోస్ట్, మీ వ్యాఖ్యలు అందంగా ఉన్నాయని ఒక యూజర్ రాశాడు. మీరు పక్షిపై చూపించిన ప్రేమ, దయకు నిజంగా మీకు అభినందనలు అంటూ మరొక యూజర్ రాశారు. పక్షి ఎంత అదృష్టవంతురాలో లక్కీ బర్డ్.. దుబాయ్ రాజుగారి కారు ఎక్కింది అని మరికొందరు ప్రశంసించారు.

Tags

Read MoreRead Less
Next Story