ఆంధ్రప్రదేశ్

పంద్రాగస్టున మూడు రాజధానుల ప్రస్తావన

పంద్రాగస్టున మూడు రాజధానుల ప్రస్తావన
X

ఈరోజు విజయవాడలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొని గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రభుత్వ సంక్షేమ శకటాలను వీక్షించారు. శకటాల్లో ముఖ్యంగా వైద్య, ఆరోగ్య శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వాతంత్ర్య సమరయోధులకు పాదాభివందనం చేసిన అనంతరం సీఎం ప్రసంగించారు. రాష్ట్ర విభజన గాయాలు మానాలన్నా, మరోసారి తగలకూడదన్నా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమన్యాయం జరగాలన్నారు. అందుకే వికేంద్రీకరణే సరైన నిర్ణయమని సీఎం జగన్ ఈ వేదికపై మరోసారి స్పష్టం చేశారు. త్వరలో విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయరాజధానిగా రూపుదిద్దుకుంటాయని జగన్ పేర్కొన్నారు.

Next Story

RELATED STORIES