కరోనా ఔషధం.. ఒక్కో ట్యాబ్లెట్ రూ.33

కొవిడ్ చికిత్సకు వాడే ఫావిపిరావిర్ ఔషధాన్ని హైదరాబాద్ కంపెనీ ఎంఎస్ఎన్ గ్రూప్ తయారు చేసింది. ఫావిలో పేరుతో 200 ఎంజీ ట్యాబ్లెట్‌ను అత్యంత చౌకగా విక్రయిస్తోంది. ఒక్కో ట్యాబ్లెట్ ధకను రూ.33 గా కంపెనీ నిర్ణయించింది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్, ఫార్ములేషన్ ను సొంత పరిశోధన, అభివృద్ధి కేంద్రంలో రూపొందించామని ఎంఎస్ఎన్ గ్రూప్ సీఎండి ఎంఎస్ఎన్ రెడ్డి తెలిపారు. నాణ్యమైన మందులు అందరికీ చవకగా అందుబాటులో ఉండాలని తాము విశ్వసిస్తున్నామని అన్నారు. ఇప్పటికే కంపెనీ కొవిడ్ చికిత్సలో వాడే ఓసెల్టామివిర్ 75 ఎంజీ క్యాప్సూల్స్ ను ప్రవేశపెట్టింది. ఫావిలో 400 ఎంజీ ట్యాబ్లెట్ ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎంఎస్ఎన్ గ్రూప్ ఈడీ భరత్ రెడ్డి తెలిపారు. డిమాండ్ కు తగ్గట్టు ఫావిలో సరఫరా చేయగలిగే సామర్థ్యం కంపెనీకి ఉందని ఆయన అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com