బిగ్ బ్రేకింగ్: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోని

X
TV5 Telugu15 Aug 2020 10:35 PM GMT
dhoni retairmant to international cricket
టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు. ధోని సడెన్ గా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆయన అభిమానులు షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో ధోని ఈ విషయాన్ని తెలిపారు. ఇన్నాళ్లు తనను, తన ఆటను అభిమానించిన అభిమానులకు ధోని ధన్యవాదాలు తెలిపారు. ధోని సుమారు 20ఏళ్లు భారత సేవలందించారు. ధోని భారత జట్టుకు సారధిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత పలు ఫార్మేట్లలో టీమిండియాకు విజయాలు అందించారు. ఆయన మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా నిలిచాడు. భారత క్రికెట్‌కు టీ20, వన్డే ప్రపంచకప్‌లను అందించి అందరి ఆదరాభిమానాలను పొందాడు.
Next Story