చందమామను చేసుకునే వరుడు.. !!

టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఒక వ్యాపారవేత్తతో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని తెలుస్తోంది. కాజల్ సన్నిహితుడు, నటుడు బెల్లంకొండ శ్రీనివాస్.. నటి రహస్య నిశ్చితార్థ వేడుకకు హాజరైనట్లు సమాచారం. గత సంవత్సరం ఆమె త్వరలో వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఆమెగానీ, కుటుంబం కానీ నిశ్చితార్ధానికి సంబంధించి ఏ ప్రకటనా చేయలేదు.

కాజల్ తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా మాత్రమే దీని గురించి అధికారిక ప్రకటన చేస్తారని కూడా చెబుతున్నారు. గత సంవత్సరం, కాజల్ అగర్వాల్ సినీ పరిశ్రమకు చెందని వ్యక్తిని వివాహం చేసుకోనున్నట్లు వెల్లడించారు. తరువాత, లక్ష్మి మంచు యొక్క చాట్ షో ఫీట్ అప్ విత్ ది స్టార్స్ తెలుగులో ప్రసారమైంది. అందులో కాజల్.. తాను 2020 లో స్థిరపడాలని అనుకున్నట్లు లక్ష్మితో పంచుకున్నారు. తనను చేసుకోబోయే వ్యక్తి ఆదర్శ భావాలు ఉన్నవాడు, ఆధ్యాత్మిక భావాలు ఉన్న వాడు అయి ఉండాలని తెలిపారు.

Next Story

RELATED STORIES