సినిమా

Akhanda Movie: 'అఖండ' కోసం థియేటర్‌కు వచ్చిన అఘోరాలు..

Akhanda Movie: అఘోరాలు అంటే ఒంటిపై రంగురంగుల బట్టలు వేసుకోకుండా, బూడిద పూసుకొని, శివనామస్మరణం చేస్తూ ఉంటారు.

Akhanda Movie: అఖండ కోసం థియేటర్‌కు వచ్చిన అఘోరాలు..
X

Akhanda Movie: అఘోరాలు అంటే ఒంటిపై రంగురంగుల బట్టలు వేసుకోకుండా, బూడిద పూసుకొని, శివనామస్మరణం చేస్తూ.. ఆద్యాత్మికమైన ప్రపంచంలో ఉంటారు. వారికి సౌకర్యాలు అవసరం లేదు. మామూలు సదుపాయాలు లేకపోయినా ఓకే. మరి అలాంటి వారికి సినిమాలు చూడాలి అనిపిస్తుందా..? అసలు అనిపించదు.. అసలు అదొక ప్రశ్నే కాదు అనుకుంటున్నారా..? కానీ విశాఖ జిల్లాలోని అఘోరాలకు సినిమా చూడాలనిపించింది. దానికోసం వారు థియేటర్లకు కూడా వెళ్లారు.

అఘోరాలపై ఇప్పటికీ తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుండి అఘోరాలు ఇలా ఉంటారు.. అలా ఉంటారు.. అంటూ ప్రేక్షకులకు చాలామంది దర్శకులు పరిచయం చేశారు. నిజ జీవితంలో కూడా చాలావరకు అఘోరాలు అలాగే ఉంటారు కూడా.. వారికి ఏ విలాసాలు వద్దు. వారు నమ్మిందే వేదంగా బతుకుతూ ఉంటారు.

కానీ అఘోరాలు కూడా సినిమాలను ఇష్టపడతారని వారు 'అఖండ' సినిమా చూడడానికి వచ్చేవరకు తెలియదు. విశాఖలో ఈ ఘటన చూసి థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. అంతే కాకుండా వారిని ఫోటోలు, వీడియోలు తీశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. బాలయ్య సినిమా అంటే ఆ మాత్రం ఉంటుందని అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు.

Next Story

RELATED STORIES