బాలీవుడ్ నటి అలియా భట్ ఇంట్లో విషాదం

బాలీవుడ్ నటి అలియా భట్ ఇంట్లో విషాదం
నా హృదయం దుఃఖంతో నిండి ఉంది, ఆనందంతో కూడా నిండి ఉంది .. ఎందుకంటే మా తాత చేసినదంతా మాకు ఆనందాన్ని అందించింది మరియు అతని మానవరాలిగా పెరిగినందుకు అదృష్టం గా భావిస్తున్నాను

బాలీవుడ్ నటి అలియా భట్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆలియా తాత నరేంద్రనాథ్ రజ్దాన్‌ (94) గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపారు. తన తాత అంటే తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఇందుకుగాను.. ఆవిడ పుట్టినరోజు వేడుకలకు సంబందించిన ఒక వీడియోను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. అందులో అతను చిన్న చిరునవ్వును చిందిస్తూ ఉంటాడు. ఫోటోకు క్యాఫ్యన్ గా ఆవిడ ఇలా రాసుకొచ్చింది. " తాత... నా హీరో... 93ఏళ్ళ వయసు వరకు నాతో గోల్ఫ్ ఆడాడు,.. 93ఏళ్ళ వరకు పనిచేశాడు.. ఆమ్లెట్ అద్భుతంగా చేస్తాడు... మంచి కథలు చెప్తాడు... వయోలిన్ వాయించడంలో దిట్ట... తాత కి క్రికెట్ అంటే చాలా ఇష్టం . స్కెచింగ్‌ అంటే కూడా ఇష్టం . తన కుటుంబాన్ని ప్రేమిస్తూ, చివరి క్షణం వరకు.. తన జీవితాన్ని ప్రేమించాడు" అని అలియా భట్ చెప్పుకొచ్చారు.
"నా హృదయం దుఃఖంతో నిండి ఉంది, ఆనందంతో కూడా నిండి ఉంది .. ఎందుకంటే మా తాత చేసినదంతా మాకు ఆనందాన్ని అందించింది మరియు అతని మానవరాలిగా పెరిగినందుకు అదృష్టం గా భావిస్తున్నాను.

Tags

Read MoreRead Less
Next Story