మంత్రి బుగ్గన ఇలాకాలో బ్లేడ్‌బ్యాచ్ హల్‌చల్‌

మంత్రి బుగ్గన ఇలాకాలో బ్లేడ్‌బ్యాచ్ హల్‌చల్‌
ఆడుకుంటున్న విద్యార్థులపై బ్లేడ్‌బ్యాచ్ దాడులు చేస్తుండటంతో భయ భ్రాంతులకు గురవుతున్న విద్యార్థులు

మంత్రి బుగ్గన నియోజకవర్గంలో బ్లేడ్‌బ్యాచ్ హల్‌చల్‌ చేసింది. గంజాయి మత్తులో బ్లేడ్‌లతో అల్లరిమూకలు దాడులకు పాల్పడుతున్నారు. స్కూలుకి వచ్చి ఆడుకుంటున్న విద్యార్థులపై బ్లేడ్‌బ్యాచ్ దాడులు చేస్తుండటంతో విద్యార్థులు భయ భ్రాంతులకు గురవుతున్నారు. మహేంద్ర అనే బాలుడిని బ్లేడ్‌తో చేతులు కోసి అల్లరిమూకలు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలుడిని ఆసుపత్రికి తరలించి బ్లేడ్‌బ్యాచ్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గంజాయి మత్తులో ఇటీవలే మూగ యువకునిపై అల్లరిమూకలు బ్లేడ్‌లతో దాడి చేశారు. బ్లేడ్‌బ్యాచ్ రెచ్చిపోతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story