Vizianagaram: అధికారులపై భగ్గుమంటున్న ఉపాధి హామీ కూలీలు

Vizianagaram: అధికారులపై భగ్గుమంటున్న ఉపాధి హామీ కూలీలు

విజయనగరం జిల్లా మెంటాడ మండలం పోరాం గ్రామంలో ఉపాధి హామీ కూలీలు అధికారులపై భగ్గుమంటున్నారు. బ్రతికి ఉన్నవారిని చనిపోయినట్లుగా చూపించడంతో కూలీల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఒక్కో రేషన్‌ కార్డుకు ఒక్కో జాబ్‌ ఇచ్చిన అధికారులు.. ఆ జాబ్‌ కార్డులో ఇంటి యజమానిని ఉంచి.. మిగతా కుటుంబ సభ్యులను తప్పించారు. సుమారు 6 వందల మంది కూలీలకు గాను.. అధికారులు 4 వందల మంది చనిపోయినట్లుగా చెప్తున్నారంటూ నిరసనకు దిగారు. బ్రతికి ఉండగానే చనిపోయినట్లు ఎలా చూపిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్వాకంతో గత ఏడాది పని చేసిన తమ కుటుంబ సభ్యులు.. ఈ ఏడాది పనికి దూరంగా ఉన్నారన్నారు. అధికారులపై చర్యలు తీసుకుని.. తమ కుటుంబ సభ్యులకు వెంటనే పని కల్పించాలని ఉపాధి హామీ కూలీలు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story