దుర్గగుడిలో 13 మంది ఉద్యోగుల సస్పెన్షన్

దుర్గగుడిలో 13 మంది ఉద్యోగుల సస్పెన్షన్
ఇంద్రకీలాద్రిపై ఇష్టారీతిన అవినీతికి పాల్పడుతున్నట్టు వీరి పాత్ర తేటతెల్లమవడంతో దేవాదాయ శాఖ కమిషనర్ చర్యలు తీసుకున్నారు.

విజయవాడ దుర్గగుడిలో 13 మంది ఉద్యోగులపై వేటు పడింది. ఇంద్రకీలాద్రిపై ఇష్టారీతిన అవినీతికి పాల్పడుతున్నట్టు వీరి పాత్ర తేటతెల్లమవడంతో దేవాదాయ శాఖ కమిషనర్ అర్జునరావు చర్యలు తీసుకున్నారు. ఇటీవల 3 రోజులు ఆలయంలో అన్ని రికార్డులు పరిశీలించి, సోదాలు చేసి ACB ఇచ్చిన నివేదిక ఆధారంగా వీరిని సస్పెండ్ చేశారు.

మొత్తం 7 విభాగాలకు చెందిన 13 మందిని విధుల నుంచి తప్పించారు. సస్పెన్షన్‌కు గురైనవారిలో ఐదుగురు సూపరింటెండెంట్‌లు, ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు. ముఖ్యంగా అన్నదానం, టికెట్ల అమ్మకాలు, చీరల విభాగం, స్టోర్స్, హౌస్ కీపింగ్‌, షాపుల లీజు, సూపర్‌వైజింగ్ విభాగాల్లో అక్రమాలకు పాల్పడుతున్నవారందరిపైన ఇప్పుడు వేటు పడింది.


Tags

Read MoreRead Less
Next Story