ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు!
ఏపీలో గడిచిన 24 గంటల్లో 43,770 కరోనా పరీక్షలు చేయగా, కొత్తగా రాష్ట్రంలో 158 కేసులు నమోదు అయ్యాయి.. ఒక్కరు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

ఏపీలో గడిచిన 24 గంటల్లో 43,770 కరోనా పరీక్షలు చేయగా, కొత్తగా రాష్ట్రంలో 158 కేసులు నమోదు అయ్యాయి.. ఒక్కరు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,86,852కి చేరింది. మరణించిన వారి సంఖ్య 7,147కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 172 మంది పూర్తిగా కోలుకోవడంతో వారి సంఖ్య 8,78,232కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,473 యాక్టివ్ కేసులున్నాయి. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 1,28,31,731 కరోనా శాంపుల్స్‌ని పరీక్షించింది ప్రభుత్వం... ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
#COVIDUpdates: 23/01/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 23, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,83,957 పాజిటివ్ కేసు లకు గాను
*8,75,337 మంది డిశ్చార్జ్ కాగా
*7,147 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,473#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/hTnGrSnfoE