ఏపీలో భారీగా పడిపోయిన కరోనా కేసులు!
గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి కృష్ణా జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో మరణాల సంఖ్య 7,078కు చేరింది.

coronavirus(File Photo)
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 40,295 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 214 మందికి కరోనా నిర్ధారణ అయింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,78,937కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. అటు గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి కృష్ణా జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో మరణాల సంఖ్య 7,078కు చేరింది. ఇక సోమవారం రోజున కొత్తగా 422 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ కేసులు సంఖ్య 3,992గా ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 1,13,01,105 కరోనా పరీక్షలు నిర్వహించింది.
#COVIDUpdates: 21/12/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) December 21, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,76,042 పాజిటివ్ కేసు లకు గాను
*8,64,972 మంది డిశ్చార్జ్ కాగా
*7,078 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3,992#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/gl0Z7FDLRw