ఆంధ్రప్రదేశ్

లేస్‌ ప్యాకెట్‌ ఇప్పిస్తానని ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్‌ చేసిన దుండగుడు

లేస్‌ ప్యాకెట్‌ ఇప్పిస్తానని ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్‌ చేసిన దుండగుడు
X

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కిడ్నాప్‌ కలకలం రేపింది.. ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలికను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. దుర్గమ్మగుడి వీధికి చెందిన ఐదేళ్ల చిన్నారి రోహిణిని లేస్‌ ప్యాకెట్‌ ఇప్పిస్తానని ఓ దుండగుడు ఎత్తుకెళ్లినట్లుగా స్థానికులు చెబుతున్నారు. లేస్‌ ప్యాకెట్‌ ఇప్పించి యాక్టివా స్కూటర్‌పై ఎత్తుకెళ్లినట్లుగా చెబుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించిన తల్లిదండ్రులు.. బాలిక ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిసరాల్లోని సీసీ కెమెరాల విజువల్స్‌ను పరిశీలిస్తున్నారు.

Next Story

RELATED STORIES