98వ రోజుకు చేరిన లోకేష్‌ యువగళం

98వ రోజుకు చేరిన లోకేష్‌ యువగళం
ఇవాళ 98వ రోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు కే.స్టార్ గోడౌన్ నుంచి నారా లోకేష్ పాదయాత్రను ప్రారంభించనున్నారు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇవాళ 98వ రోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు కే.స్టార్ గోడౌన్ నుంచి నారా లోకేష్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. అనంతరం 3 గంటల 50 నిమిషాలకు కరివేనలో స్థానికులతో సమావేశం అవుతారు. నాలుగున్నర గంటలకు ఆత్మకూరు బహిరంగసభలో లోకేష్‌ ప్రసంగిస్తారు. ఆ తర్వాత పాదయాత్రలో భాగంగా స్వచ్ఛభారత్ అంబాసిడర్లు, స్థానిక వ్యాపారులు, డ్వాక్ర మహిళలు, ముస్లీంలు, రైతులతో సమావేశం కానున్నారు. రాత్రి 9 గంటల 55 నిమిషాలకు చెంచుకాలని శివారు విడిది కేంద్రంలో నారా లోకేష్ బస చేయనున్నారు.

అంతకుముందు.. నందికొట్కూరు నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం ప్రతినిధులతో లోకేష్‌ ముఖాముఖి నిర్వహించారు. దళితుల ఉన్నత విద్యకు ఉపయోగపడిన విదేశీ విద్య పథకాన్ని జగన్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. దళితులకు చెందిన సబ్‌ ప్లాన్‌ నిధులు పక్కదారి పట్టిస్తున్నారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దళితుల భూములను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. గత టీడీపీ హయాంలో ఎస్సీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చామన్నారు. దళితవాడల అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక దళితుల అభివృద్ఢికి కృషి చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story