Amaravati: ఇళ్ల స్థలాల పంపిణీకి మరో 268 ఎకరాలు

Amaravati: ఇళ్ల స్థలాల పంపిణీకి మరో 268 ఎకరాలు
గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన 50 వేల మందికి రాజధానిలో ఇళ్ల స్థలాలు

అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం మరో 268 ఎకరాలు కేటాయిస్తోంది. గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన 50 వేల మందికి రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం... ఇప్పటికే 1,134 ఎకరాల్ని కేటాయించింది. ఇందుకోసం సీఆర్‌డీఏ చట్టాన్ని సవరిస్తూ, రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేస్తూ ఆర్‌-5 పేరుతో కొత్త రెసిడెన్షియల్‌ జోన్‌ ఏర్పాటుచేసింది. ఎన్టీఆర్‌ జిల్లాకు 584 ఎకరాలు, గుంటూరు జిల్లాకు 550 ఎకరాలు కేటాయించింది. వాటిలో లేఅవుట్‌ల అభివృద్ధి, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల యంత్రాంగం వేగంగా పూర్తిచేస్తుండగా... ఆ రెండు జిల్లాల కలెక్టర్ల విజ్ఞప్తి మేరకు మరో 268 ఎకరాల్ని కేటాయించాలని ల్యాండ్‌ ఎలాట్‌మెంట్‌ స్క్రూటినీ కమిటీ నిర్ణయించింది.

నిన్న ఎల్‌ఏఎస్‌సీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సిఫారసు మేరకు ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 168 ఎకరాలు, గుంటూరులో మరో 100 ఎకరాలు సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు

పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మికి... సీఆర్‌డీఏ కమిషనర్‌ ప్రతిపాదన పంపారు.. రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో ఎస్‌3 జోన్‌లో... బోరుపాలెం, పిచ్చికపాలెం, అనంతవరం గ్రామాల పరిధిలో ఎన్టీఆర్‌ జిల్లా వారికి, నెక్కల్లు గ్రామ పరిధిలో గుంటూరు జిల్లా వారికి భూములు కేటాయించాలని కోరారు. సీఆర్‌డీఏకి ఒక్కో ఎకరానికి రూ.24.60 లక్షల చొప్పన రెవెన్యూశాఖ చెల్లించే ప్రాతిపదికన భూములు కేటాయించాలని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story