రైతుకు బేడీలు వేసిన ఘటనపై జిల్లా ఎస్పీ సీరియస్

రైతులకు బేడీలు వేసిన ఘటన ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది.. ఈ ఘటనపై గుంటూరు ఎస్పీ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.. ఎస్కార్ట్ విధుల్లో ఉన్న ఆరుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.. రాజధాని ప్రాంత రైతుల్ని నరసరావుపేట సబ్ జైలుకు తరలించే సమయంలో బేడీలు వేసుకుని పోలీసులు తీసుకెళ్లారు.. ఈ విషయం మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో ఎస్పీ చర్యలు తీసుకున్నారు.
నరసరావుపేట ప్రత్యేక మొబైల్ కోర్టు ఆదేశాలతో వివిధ కేసులలో ముద్దాయిలుగా ఉన్న 43 మంది రిమాండ్ ఖైదీల్ని కరోనా నిర్థారణ పరీక్షల తర్వాత జిల్లా జైలుకు, గుంటూరుకు తరలించే క్రమంలో చేతులకు బేడీలు వేశారు. AR సిబ్బందితో కూడిన ప్రిజనర్స్ ఎస్కార్ట్ టీమ్ ఇలా వ్యహరించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. 3 రాజధానులకు మద్దతుగా ధర్నాకు వస్తున్న వారిని అడ్డుకున్న ఘటనలో రైతుల్ని అరెస్టు చేశారు. వారిని జైల్‌కు తరలిస్తూ బేడీలు వేయడం పట్ల సర్వత్రా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే గుంటూరు ఎస్పీ విశాల్ గున్నీ స్పందించారు. ఎస్సార్ విధుల్లో ఉన్న వారిని తప్పించడమే కాకుండా ఆర్‌ఎస్సై, ఆర్‌ఐలకు ఛార్జ్‌మెమో పంపించారు. దీనిపై పూర్తి విచారణకు అదనపు ఎస్పీ స్థాయి అధికారి నియామించారు.
అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న రైతుల చేతులకు బేడీలా? రైతులేమైనా రౌడీలా? గూండాలా? అంటూ ఈ ఘటనపై నిన్ననే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ తీరు, పోలీసుల అత్యుత్సాహంపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం... శాంతి యుతంగా రాజధాని కోసం పోరాడుతున్న రైతులపై ఇంత దాష్టీకానికి తిగడంపై అంతా మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఎస్పీ విశాల్ గున్నీ బాధ్యుల్ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు.
RELATED STORIES
Drone Pilot: 'టెన్త్' అర్హతతో 'డ్రోన్ పైలట్'.. మరో బెస్ట్ కెరీర్...
17 May 2022 5:30 AM GMTFCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. వాచ్ మెన్ నుండి...
16 May 2022 4:30 AM GMTBihar : బీహార్ సీఎంకి షాకిచ్చిన 11 ఏళ్ల బాలుడు...!
15 May 2022 3:15 PM GMTIOCL recruitment 2022 : ఇంజినీరింగ్ అర్హతతో ఐఓసీఎల్ లో ఉద్యోగాలు.....
14 May 2022 4:30 AM GMTSSC Phase X Recruitment 2022: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర...
13 May 2022 4:45 AM GMTIndia Post Payments Bank(IPPB) GDS Recruitment 2022: డిగ్రీ అర్హతతో ...
12 May 2022 4:30 AM GMT