144 సెక్షన్‌ పేరుతో మా శిబిరాలను ఖాళీ చేయిస్తున్నారు : అమరావతి రైతులు

144 సెక్షన్‌ పేరుతో మా శిబిరాలను ఖాళీ చేయిస్తున్నారు : అమరావతి రైతులు

ప్రతీకాత్మక చిత్రం

ఏపీ రాజధానిగా అమరావతే ఉండాలంటూ.. రైతుల చేస్తోన్న ఉద్యమం అలుపెరుగకుండా సాగుతోంది. ఇప్పటికే 350వ రోజూలు దాటింది. అయినా ప్రభుత్వం రైతుల ఉద్యమాన్ని పట్టించుకోవడం లేదు. సీఎం జగన్‌ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అమరావతి రైతులు. ఎన్నికల ముందు అమరావతికి మద్దతిచ్చిన జగన్..... అధికారంలోకి వచ్చాక మాటమార్చాడంటూ ఫైర్‌ అయ్యారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా కాగడాలు, కొవ్వొత్తులు వెలిగించి శిబిరాల్లో నిరసనలు తెలిపారు. అయితే.. 144 సెక్షన్‌ పేరుతో తమ శిబిరాలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అమరావతి రైతులు, మహిళలు.

మందడంలో రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రైతుల శిబిరంలో మంత్రి కొడాలి నాని దిష్టిబొమ్మను పెట్టేందుకు రైతులు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. మూడు రాజధానుల శిబిరంలో ఎన్ని దిష్టిబొమ్మలు కట్టినా పట్టించుకోని పోలీసులు తమ శిబిరంలో ఎలా అడ్డుకుంటారని రైతులతో వాగ్వాదానికి దిగారు. రైతులను పక్కకు నెట్టేసి మంత్రి దిష్టిబొమ్మను పోలీసులు తొలగించారు. దీంతో పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు పెద్దఎత్తున నినాదాలు చేశారు..

తాడేపల్లి మండలం పెనుమాక, మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్ర బాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లో జరుగుతున్న దీక్షలు చేస్తున్నారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామంలో రైతులు, మహిళలు నిరస నలు కొనసాగించారు. వానకు, చలిని లెక్కచేయకుండా పోరాటాన్ని కొనసాగిస్తున్నారు రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రాజధాని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story