ఆంధ్రప్రదేశ్

అమరావతిలో గుట్టురట్టైన పెయిడ్‌ ఆర్టిస్టుల నకిలీ ఉద్యమం

అమరావతిలో గుట్టురట్టైన పెయిడ్‌ ఆర్టిస్టుల నకిలీ ఉద్యమం
X

అమరావతిలో గుట్టురట్టైన పెయిడ్‌ ఆర్టిస్టుల నకిలీ ఉద్యమం మూడు రాజధానులకు అనుకూలంగా జరుగుతున్న నిరసనలు పెయిడ్ ఆర్టిస్టుల పనేనని తేటతెల్లమైంది. మంగళగిరి సహా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొందర్నీ ఆటోల్లో ఎక్కించుకుని మరీ రాజధాని ప్రాంతానికి తీసుకుని వచ్చి ధర్నాలు చేయిస్తున్నారు. ఇందులో భాగంగా కృష్ణరాయుని పాలెంలో కొందర్ని అడ్డుకున్నారు స్థానిక దళితులు.. పెనుమాక, కృష్ణాయపాలెం మధ్య 15 ఆటోల్ని ఆపిన స్థానిక దళితులు, ఆటోల్లో వచ్చిన వారిని నిలదీశారు.

ఆటోల్లో ఉన్నవారిని రాజధానికి ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. దీంతో తత్తరపడిన పెయిడ్‌ ఆర్టిస్టులు.. తాము కూడా లోకల్ వాళ్లమేనని బుకాయించే ప్రయత్నం చేశారు. ఐతే, ఆధార్ కార్డులు చూపించండి అంటూ నిలదీసేసరికి షాక్‌ అయ్యి ఏం చేయాలో తెలియక మిన్నకుండిపోయారు. స్థానిక YCP ప్రజాప్రతినిధే వీరందరినీ నకిలీ ఉద్యమం చేసేందుకు తీసుకువెళ్తున్నారంటూ దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని స్థానికులు అడ్డుకుంటే.. తిరిగి పోలీసులు స్థానికులపైనే కేసులు వేయడం కలకలం రేపుతోంది. దళిత జేఏసీ నేత శిరీషతో పాటు ఇతర దళితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాసేపటి తరువాత తూళ్లురు స్టేషన్‌లో వారి సంతకాలు తీసుకొని విడిచిపెట్టారు. దీనిపై రాజధాని దళిత జేఏసీ తీవ్ర స్థాయిలో మండిపడింది. రాష్ట్ర భవిష్యత్తుకోసం ఆలోచించే తమపై ఇలా కక్ష పూరితంగా వ్యవహరించడం దారుణమన్నారు..

ఆంధ్ర ప్రదేశ్‌ భవిష్యత్తు కోసం.. అమరావతి కోసం.. భూములచ్చిన తామంతా ఏడాదిగా ఆందోళనలు చేస్తుంటే.. ప్రభుత్వం ఇలా కక్ష సాధించడం సరైంది కాదని మండిపడుతున్నారు. జాతీయ స్థాయిలో తమ ఉద్యమానికి మద్దతు వస్తుండడంతోనే.. అణిచివేసేందుకు కుట్రలు చేస్తున్నారంటూ రాజధాని రైతులు, మహిళలు మండిపడున్నారు. వైసీపీ నేతలే కావాలని డబ్బలు ఇచ్చి, అలా వచ్చినవారికి భోజనాలు కూడా పెడుతూ నకిలీ ఉద్యమం చేయిచండం దారుణమంటున్నారు. అమరావతిలో ముఖ్యమైన సందర్భాల్లో నిరసనలు జరుగుతాయని తెలిసిన ప్రతిసారీ ఇలా ఆటోల్లో పెయిడ్ బ్యాచ్‌ను దించుతున్నారని ఇది సిగ్గుచేటని రాజధాని దళితులు అంటున్నారు.

Next Story

RELATED STORIES