అమరావతి ఉద్యమం 300వ రోజుకు చేరిన సందర్భంగా 3 రోజుల పాటు ర్యాలీలు చేపట్టాలి: చంద్రబాబు

అమరావతి ఉద్యమం 300వ రోజుకు చేరిన సందర్భంగా 3 రోజుల పాటు ర్యాలీలు చేపట్టాలి: చంద్రబాబు
విశాఖకు, కర్నూలుకు వైసీపీ ఒరగబెట్టిందేమీ లేదని చంద్రబాబు విమర్శించారు.

అమరావతి పరిరక్షణ ఉద్యమం 300వ రోజుకు చేరిన సందర్భంగా తెలుగుదేశం మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ మండల ఇంఛార్జ్‌లు, నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 3 రోజుల పాటు సంఘీభావ దీక్షలు, ర్యాలీలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆందోళనల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఆదివారం ''అమరావతి పరిరక్షణ సంఘీభావ ర్యాలీలు'' జరపాలని చెప్పారు. రాత్రి స్కై లాంతర్ల ద్వారా నిరసన దీపాలు వెలిగించాలని తెలిపారు.

సోమవారం ఉదయం ఎమ్మార్వో ఆఫీసుల ముందు ప్రదర్శనలు నిర్వహించాలని శ్రేణులకు చంద్రబాబు సూచించారు. ఆందోళనల్లో పాల్గొనేవాళ్లు కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని చెప్పారు. విశాఖకు, కర్నూలుకు వైసీపీ ఒరగబెట్టిందేమీ లేదని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ హయాంలో చేసిన అభివృద్దే తప్ప కొత్త ప్రాజెక్టు ఒక్కటీ తేలేదని మండిపడ్డారు. వైసీపీ ఏడాదిన్నర పాలనలో ఉత్తరాంధ్రకు ఏం ఒరగబెట్టిందని ప్రశ్నించారు. రాయలసీమకు 18నెలల్లో ఏం చేశారని నిలదీశారు.

Read MoreRead Less
Next Story