అమరావతి రైతుల్లో కనిపించని సంక్రాంతి సంబరాలు!
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా సంక్రాంతి సంబరాల్లో మునిగితేలుతుంటే.. అమరావతి రైతులు మాత్రం రాజధాని సమరాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు.

X
Vamshi Krishna14 Jan 2021 7:59 AM GMT
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా సంక్రాంతి సంబరాల్లో మునిగితేలుతుంటే.. అమరావతి రైతులు మాత్రం రాజధాని సమరాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. సంక్రాంతి పండుగ రోజు రాజధాని గ్రామాల రైతులు శిబిరాల్లోనే ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి అంటే రైతుల పండుగ అంటారు కానీ... తమకు మాత్రం ఎలాంటి పండుగ లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
మూడు రాజధానుల పేరుతో సర్కారు తమ బతుకుల్లో ఆనందాలను ఆవిరి చేసిందని మండిపడుతున్నారు. 394 రోజులుగా అమరావతి కోసం ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి ఏకైక రాజధాని అని చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని, వెలగపూడి రైతులు అన్నారు.
Next Story